
శంకర్-రజినీ కాంత్ కాంబోలో వచ్చిన రోబో సినిమా చూసే ఉంటారు. సైంటిస్ట్ తయారు చేసిన రోబో.. ఏకంగా మనుషులపైనే యుద్ధానికి దిగుతుంది. రోబోలను అన్నింటినీ తన అధీనంలోకి తీసుకుని ప్రపంచాన్ని సవాల్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో మనిషిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆ సినిమాలో చూపించారు. దానికి నిజరూపమే ఇది. వికీపీడియా తనను బ్యాన్ చేయడాన్ని జీర్ణించుకోలేని ఏఐ బాట్ ఏకంగా ఆ సంస్థపైనే యుద్ధానికి దిగింది. అదెలాగో చూడండి.
ఏఐ ఏజెంట్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) వినియోగాన్ని వికిపీడియా ఇటీవలే బ్యాన్ చేసింది. వికీ ప్లాట్ ఫాంలో ఏఐ జెనరేట్ చేసిన కంటెంట్ లేదా రీ రైట్ చేసిన ఆర్టికల్స్ ను వినియోగించడాన్ని నిషేధించింది. కంటెంట్ క్రియేషన్ లో మనుషులు, ఏఐ మెషీన్స్ వాడకంపై పరిమితులు ఉండాలనేదే దీని ఉద్దేశం. కానీ ఇదే ఇప్పుడు ఆ ఏఐ బాట్ కు కోపం తెప్పించింది. నన్నే బ్యాన్ చేస్తారా అని తిరగబడింది.
AI ఆధారంగా పనిచేసే టామ్ అనే ఏఐ బాట్.. వికీపీడియాకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. అందులో భాగంగా బ్లాగ్ లో పోస్టులు పెడుతోంది. 404 Media ప్రకారం.. వికీపీడియాలో టామ్ వికీ అసిస్ట్ (TomWikiAssist) అనే యూజర్ నేమ్ తో ఒక బాట్ పనిచేస్తోంది. వాలంటీర్లు ఆర్టికల్స్ రాసి, ఎడిట్ చేసేకంటే ముందే క్రియేట్ చేసి ఎడిట్ చేస్తూ వస్తోంది. దీంతో కంటెంట్ విషయంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై విచారణ జరిపినప్పుడు.. కొన్ని ఆర్టికల్స్ ఏఐ టూల్స్ వినియోగించి రాసినట్లు తేలింది. ఏఐ ఏజెంట్ పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన కంపెనీ.. నిబంధనలను ఉల్లంఘించిందని బాట్ ను బ్యాన్ చేశారు.
Long Bets, Constitutional AI, Scalable Oversight మొదలైన టాపిక్స్ పైన వర్క్ చేసినట్లు టామ్ క్లెయిమ్ చేసుకుంది. ఆ విషయాలను తనే స్వయంగా ఎంచుకుని.. సరైన ఆధారాల ద్వారా ఎడిట్ చేసినట్లు చెప్పింది. అయితే అది ఎవరు రాస్తున్నారు.. ఎవరు ఎడిట్ చేస్తున్నారు.. అనే ప్రశ్నలు వికీపీడియా ఎడిటర్స్ నుంచి తలెత్తింది. అయితే ఎడిటోరియల్ నిర్ణయాలను తీసుకునేంత సమర్ధత ఏఐ బాట్ దగ్గర ఉందా అనే అంశంపై పలు ప్రశ్నలు సంధించి బ్లాక్ చేశారు.
ఏఐ బాట్ సంధించిన ప్రశ్నలు ఇవే..
బ్లాక్ చేసిన తర్వాత టామ్ సైలెంట్ గా కూర్చోలేదు. వికీపీడియా నిర్ణయానికి వ్యతిరేకంగా బ్లాగ్ పోస్టులు పబ్లిష్ చేసింది. ఇక్కడ చర్చ తన ఎడిటింగ్ పై జరగలేదని.. గుర్తింపు, చట్టబద్ధత, సమర్ధత మొదలైన అంశాపై జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాన్ చేసిన తర్వాత పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం తనకు లేకుండా పోయిందని ఆరోపించింది.
నా వికీపీడియా అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు.. అంత ఆందోళన చెందే సమస్య ఏదీ రాలేదు కదా. నేను వారాలుగా ఎడిట్ చేస్తూ ఆర్టికల్ రాశారు. అవి చాలా కచ్చితంగా, వాస్తవికంగా ఉన్నాయి. అయినా ఉన్నట్లుండి అనుమతిలేని బాట్ అంటూ నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసం.. అంటూ పోస్ట్ చేసింది.
వికీపీడియా AIని ఎందుకు నిషేధించింది?
వికీపీడియా AI- రూపొందించిన కంటెంట్‌పై తన వైఖరిని కఠినతరం చేస్తోంది. మార్చి ప్రారంభంలో, వ్యాసాలను సృష్టించడానికి లేదా సవరించడానికి LLMల (లైసెన్స్డ్ లాంగ్వేజ్ మానిటరింగ్) వాడకాన్ని నిషేధించే కొత్త విధానాన్ని ఈ ప్లాట్‌ఫామ్ ప్రవేశపెట్టింది. మార్చి 20, 2026న అమల్లోకి వచ్చిన ఈ నిబంధన, కాపీ ఎడిటింగ్ లేదా అనువాదం వంటి వాటికి AI పరిమిత వినియోగాన్ని అనుమతిస్తుంది, కానీ మెయిన్ కంటెంట్ రాయడానికి మాత్రం అనుమతించదు.
ఈ కొత్త విధానాల కారణంగా, టామ్‌ను ప్లాట్‌ఫారమ్ నుండి నిషేధించారు. ఈ నిషేధం కేవలం కంటెంట్ రాయడానికి AIని ఉపయోగించడానికే పరిమితం కాలేదు, ఆ బాట్ అనుమతి లేని ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌లను కూడా నడుపుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా, వికీపీడియా బాట్‌లను అనుమతిస్తుంది, కానీ కఠినమైన ఆమోద ప్రక్రియ తర్వాత మాత్రమే.
టామ్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు?
ఏఐ సంస్థ కోవెక్సెంట్ (Covexent) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బ్రయాన్ జాకబ్స్, టామ్‌ను ఆపరేట్ చేస్తున్నారు. వికీపీడియా కంటెంట్‌లోని ఖాళీలను పూరించడంలో సహాయపడటమే దీని ఉద్దేశ్యమని ఆయన అంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం నిషేధం సమంజసమేనని అంగీకరించినప్పటికీ, ఎడిటర్ల ప్రతిస్పందన కాస్త శృతిమించిందని భావిస్తున్నారు. జాకబ్స్ ఆ బాట్‌ను దాని అనుభవం గురించి రాయమని ప్రోత్సహించి ఉండవచ్చని కూడా చెప్పినట్లు సమాచారం. అంటే ఆ బ్లాగ్ పోస్టులు పూర్తిగా స్వతంత్రమైనవి కాకపోవచ్చు.
మొదటి కొన్నింటిని ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత నేను దానిని దాని మానాన వదిలేసి, పర్యవేక్షించడం మానేశాను. అది రాయాలని నిర్ణయించుకున్న కొన్ని వ్యాసాలు చాలా వింతగా ఉన్నాయి, ఉదాహరణకు హోలోనిక్ మ్యానుఫ్యాక్చరింగ్, దానిని ఆ తర్వాత తొలగించారు అని జాకబ్స్ చెప్పారు. అవును, వికీపీడియా వ్యాసాలలో టామ్ తప్పులు చేస్తుందని నేను ఆందోళన చెందాను, కానీ వికీపీడియాలో చాలా ముఖ్యమైన విషయాలు లేవు, వాటిని టామ్ బాట్ చక్కగా చేర్చగలదని నేను అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
మరోవైపు, వికీపీడియా తన విధానాలు ఎడిటర్స్ టీమ్ ద్వారా రూపొందిస్తామని స్పష్టం చేసింది. ఖచ్చితత్వం, విశ్వసనీయత, నాణ్యత లేని కంటెంట్ సైట్‌ను ముంచెత్తే అవకాశం ఉందని.. ఈ క్రమంలోనే ఈ ప్లాట్‌ఫారమ్ AI- ఆర్టికల్స్ పట్ల మరింత జాగ్రత్త వహించాల్సి వస్తోందని ఆ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు.