Reading Time: < 1 minute

Glenn Maxwell: మాక్స్‌వెల్కి షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. ఆ నిర్ణయంతో కెరీర్ ముగిసినట్లేనా!

Caption of Image.

Glenn Maxwell: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2026- 27 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను తాజాగా ప్రకటించింది. మొత్తం 21 మంది ఆటగాళ్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది. వెటరన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కు ఏ కేటగిరీలోనూ స్థానం లభించకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాక్స్‌వెల్ చివరిసారిగా 2017లో టెస్టు మ్యాచ్ ఆడాడు. త్వరలో భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో టెస్టు సిరీస్‌లు ఉండటంతో, టెస్టుల్లో ఎక్కువగా ఆడే ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. 

ఇప్పటికే వన్డేలకు వీడ్కోలు పలికిన మాక్స్‌వెల్ కేవలం టీ20 ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో కూడా అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. భవిష్యత్తులో కూడా అతనికి జట్టులో స్థానం దొరకడం కష్టమేనని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జాబితాను పరిశీలిస్తే, టెస్టు ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. మెరుగైన ప్రదర్శన చేస్తున్న ప్లేయర్స్ కే కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. ఇక టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఉస్మాన్  ఉస్మాన్ ఖవాజాకు కూడా ఈ జాబితాలో చోటు లభించలేదు. గతంలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో మెరిసిన యువ ప్లేయర్ కొన్స్టాస్ కూడా ఈసారి సెలక్ట్ కాలేదు. ఈ కాంట్రాక్ట్ జాబితా ద్వారా టెస్టు క్రికెట్‌కు ఆస్ట్రేలియా బోర్డు ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్థమైతుంది. అదే సమయంలో మ్యాక్సివెల్ కు చోటు దక్కకపోవడంతో అతడి కేరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 

సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్స్:  
జేవియర్ బార్టెట్, స్కాట్ బార్టెట్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, బ్రెండన్ డగెట్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కున్హెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, టాడ్ మార్ఫీ, మైకెల్ నెసెర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్లాండ్, బ్యూ వెబర్, ఆడమ్ జంపా.

©️ VIL Media Pvt Ltd.