
పసిడి ప్రియులకు ధరలు షాకిచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పెళ్లిళ్లు సీజన్, శుభకార్యాల సమయంలో ధరలు దిగి రావడంతో మగువలు, సామాన్యులు భారీ ఊరట పొందారు. మరింత తగ్గొచ్చని భావిస్తున్న తరుణంలో తాజాగా ఝలక్ ఇచ్చాయి. ఈరోజు తులం గోల్డ్‌పై ఏకంగా రూ.1,970 పెరగగా.. కిలో వెండిపై రూ.5,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Director Ranjith: హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. దర్శకుడు రంజిత్ అరెస్ట్
తులం గోల్డ్‌పై రూ.1,970 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,800 పెరగడంతో రూ.1,38,850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,480 పెరగడంతో రూ.1,13,610 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
సిల్వర్ ధర కూడా భారీ షాకిచ్చింది. బుధవారం కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,55, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,55, 000 దగ్గర అమ్ముడవుతోంది.