Reading Time: 2 minutes

IPL 2026: రిజ్వీ ఇంపాక్ట్.. లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ ఘన విజయం

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా ల‌క్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతుకు ముందు టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాటింగ్ లో తడబడింది. మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 35 పరుగులు), అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 36 పరుగులు ) మాత్రమే రాణించగా.. రిషబ్ పంత్ (7), ఐడెన్ మార్క్రమ్ (11), ఆయుష్ బడోని (0), నికోలస్ పూరన్ (8), ముకుల్ చౌదరి (14), మహమ్మద్ షమీ (1), అన్రిచ్ నోర్ట్జే(0), మొహ్సిన్ ఖాన్(0) విఫలం కావడంతో 18.4 ఓవర్లలోనే 141 పరుగులకే ఆలౌట్ అయింది.  

అనంతరం 142 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కేవలం 5 ఓవర్లు ముగిసే సమయానికి కీలక ఆటగాళ్లైనా కేఎల్ రాహుల్ (0), నితీష్ రాణా (15), పథుమ్ నిస్సంక(1), అక్షర్ పటేల్(0) వంటి కీలక ఆటగాళ్లు వరుసగా అవుట్ కావడంతో జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రిజ్వీ ఈ మ్యాచులో తన ఇంపాక్ట్ చూపించాడు. సూపర్బ్ ( 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 70 పరుగులు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

మరోవైపు ట్రిస్టన్ స్టబ్స్ ( 32 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సులతో 39 పరుగులు) సైతం భారీ షాట్స్ ఆడుతూ రిజ్వీకి సమహారం అందిస్తూ ఢిల్లీని గెలిపించారు. ఈ మ్యాచులో వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన తర్వాత ఈ ఇద్దరు బ్యాటర్లు కలిసి ఐదో వికెట్ కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతోనే విజయం ఢిల్లీని వరించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ కీలకమైన రెండు వికెట్లు తీసుకోగా, మహ్మద్ షమీ, మోహ్సిన్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. 
 

©️ VIL Media Pvt Ltd.