Reading Time: 2 minutes

రండి రండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నం: అమెరికా దళాలకు ఇరాన్ సెటైరికల్ వార్నింగ్

Caption of Image.

టెహ్రాన్: ఇప్పటి వరకు వైమానిక దాడులతో ఇరాన్‎పై విరుచుకుపడిన అమెరికా లేటేస్ట్‎గా గ్రౌండ్ ఆపరేషన్స్‎కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భూతల దాడులతో ఇరాన్‎పై విరుచుకుపడేందుకు మిడిల్ ఈస్ట్‎లో భారీగా సైన్యాన్ని మోహరిస్తుంది అమెరికా. ఇప్పటికే దాదాపు 10 వేలకు మంది పైగా దళాలను పశ్చిమాసియాకు తరలించింది అమెరికా. ఈ క్రమంలో అమెరికాకు సెటైరికల్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. రండి రండి మీ కోసమే ఎదురు చూస్తున్నమంటూ హెచ్చరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. 

ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ ప్రెస్ టీవీ ప్రచారం చేసిన ఈ వీడియోలో ఇరాన్ స్పెషల్ కమాండోలు అమెరికా సైనికులను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో ద్వారా ఇరాన్ పరోక్షంగా అమెరికాకు వార్నింగ్ మేసేజ్ పంపింది. ఈ వీడియోలో ‘‘రండి.. మీ కోసమే వెయిట్ చేస్తున్నాం’’ అని హెచ్చరించడం గమనార్హం.  

400 కిలోల యురేనియం కోసం భారీ స్కెచ్..!

ఇరాన్‎పై డొనాల్డ్ ట్రంప్ అత్యంత సాహసోపేతమైన ‘గ్రౌండ్ ఆపరేషన్’కు సిద్ధమవుతున్నారు. ఇరాన్ వద్ద ఉన్న దాదాపు 400 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియంను నేరుగా స్వాధీనం చేసుకోవడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. కేవలం గగనతల దాడులకే పరిమితం కాకుండా, అమెరికా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించే అవకాశం ఉంది. ఇరాన్ భూగర్భ అణు కేంద్రమైన నతాంజ్ లక్ష్యంగా మెరుపు దాడి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సైనికులు నేరుగా అణు కేంద్రాల్లోకి ప్రవేశించి, అక్కడ నిల్వ ఉన్న అణు ఇంధనాన్ని డబ్బాల్లో నింపి సురక్షితంగా తరలించాలని పెంటగాన్ యోచిస్తోంది.

అత్యంత ప్రమాదకరమైన ప్లాన్..

ఈ ప్లాన్ అమలు చేయడం అత్యంత ప్రమాదకరమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణు కేంద్రంపై భౌతిక దాడులు జరిగితే భారీ స్థాయిలో లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆ ప్రాంతంలో పెను విపత్తుకు దారితీయడమే కాకుండా, వేలాది మంది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. అంతేకాకుండా, ఈ అణుకేంద్రాలకు ఇరాన్ తన అత్యంత శక్తిమంతమైన ‘రివల్యూషనరీ గార్డ్స్’‎తో భద్రత కల్పించిందని, అక్కడ అమెరికా సైన్యం భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.