
లోక్‌సభ బుధవారం జన విశ్వాస్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. 23 మంత్రిత్వశాఖల నిర్వహణలోని 79 కేంద్రీయ చట్టాలలోని 784 నిబంధనల సవరణకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చిన్న పాటి నేరాలను శిక్షారహితం చేసేందుకు , నిర్వహణపరమైన సరళీకృతానికి బిల్లును తీసుకువచ్చారు. కాలం చెల్లిన, నిరర్థక నిబందనల ఎత్తివేతకు సంబంధించి వేయి వరకూ నేరాల సమీక్ష తరువాత బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ప్రజలకు , ఎంఎస్‌ఎంఇలకు ఉపయోగపడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. బిల్లుకు వరంగల్ కాంగ్రెస్ సభ్యులు కడియం కావ్య తీసుకువచ్చిన మార్పులు చేర్పులను సభ తిరస్కరించింది. అభ్యంతరాలను తోసిపుచ్చారు.