
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ఏప్రిల్ 2న ప్రసంగించనున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6:30 గంటలకు ట్రంప్ మాట్లాడనున్నారు. అయితే ట్రంప్ ప్రసంగంపై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏం మాట్లాడబోతున్నారంటూ చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
గత నెల రోజులుగా ఇరాన్‌పై అమెరికా యుద్ధం చేస్తోంది. ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడి చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అంతేకాకుండా గల్ఫ్‌లో పెద్ద ఎత్తున ఇంధన, గ్యాస్ క్షేత్రాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ముగించబోతున్నట్లుగా ఇప్పటికే ట్రంప్ కీలక సంకేతాలు ఇచ్చారు. చాలా త్వరగా యుద్ధం ముగించనున్నట్లు వైట్‌హౌస్ వేదికగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Stock Market: యుద్ధంపై ట్రంప్ సానుకూల ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
ఇక ఏప్రిల్ 2న అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడనున్నారు. ఈ ప్రసంగంలో ఇరాన్‌పై యుద్ధం ముగించబోతున్నట్లుగా ప్రకటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ ఏం మాట్లాడనున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఏప్రిల్ 1 నుంచి అమెరికాలోని ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్‌తో సహా 18 కంపెనీల పేర్లను పేర్కొంటూ వాటి ప్రాంతీయ కార్యకలాపాలు దెబ్బతీస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
