
గ్లోబల్ ఐకాన్, వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గుళ్లో గిన్నెలు (పాత్రలు) కడిగింది. తెలుగు, హిందీతో పాటు హాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పొందుతున్న ఆమె, సాధారణ భక్తురాలిగా భక్తులు తిన్న గిన్నెలు కడగడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విస్తృత చర్చకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మంగళవారం (2026 మార్చి 31న) ప్రియాంక చోప్రా పంజాబ్‌లోని అమృతసర్‌లో ఉన్న ప్రసిద్ధ హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్)ను సందర్శించింది. పింక్ కలర్ డ్రెస్ ధరించి, తలపై దుపట్టా వేసుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రియాంక తన మత సంప్రదాయానికి అనుగుణంగా ‘సేవా’లో భాగంగా గిన్నెలు కడిగారు. భక్తులు భోజనం చేసిన పాత్రలను ఆలయ ప్రాంగణంలో నేలపై కూర్చుని శుభ్రం చేస్తూ తన భక్తిశ్రద్ధలను నిర్వర్తించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఆమె తన మూలాలను మరిచిపోకుండా ఇలా సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం గ్రేట్ అని” అని ఒక అభిమాని కామెంట్ చేశారు.
#WATCH | Punjab: Actress Priyanka Chopra offered prayers and performed sewa at Sri Darbar Sahib, the Golden Temple in Amritsar. pic.twitter.com/rPaORCa3Ry
— ANI (@ANI) March 31, 2026
మరొకరు, “ప్రపంచవ్యాప్త స్టార్‌గా, అత్యధిక పారితోషికం పొందే నటిగా ఉన్నప్పటికీ, ఆమె వినయశీలత అభినందనీయం” అని వ్యాఖ్యానించారు. ఇంకొక నెటిజన్, “విదేశీయుడిని వివాహం చేసుకున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆచారాలను కొనసాగించడం గొప్ప విషయం” అని స్పందించారు.
ఇదే సమయంలో చిన్న సక్సెస్ వస్తేనే నేలపై నడవని మనుషులు ఉన్న ఈ రోజుల్లో.. ఐకాన్ స్టేటస్ అనుభవిస్తున్న ప్రియాంక మాత్రం సాధారణ భక్తురాలిగా సేవలో పాల్గొని గిన్నెలు తోమడం “రియల్లీ గ్రేట్” అని కామెంట్స్ పెడుతున్నారు.
వారణాసిలో ‘మందాకిని’:
ప్రియాంక చోప్రా కేవలం హాలీవుడ్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi) లో కూడా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రియాంక కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.
►ALSO READ | కుంగదీసిన కొడుకు మరణం.. డైరెక్టర్ భారతీరాజా ఇలా అయిపోయారేంటి.. తీవ్ర ఆందోళనలో అభిమానులు
ఈ మూవీలో కథానాయుడు మహేష్ బాబు సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ చిత్రంలో ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ‘మందాకిని’ అనేది శివుడి జటాలో ప్రవహించే గంగకు మరో పేరు. ఈ పేరుతోనే ఆమె పాత్రలో పురాణ సింబాలిజం స్పష్టమవుతోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పసుపు రంగు చీరలో, చేతిలో పిస్టల్‌తో కనిపించిన ఆమె లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రాజమౌళి మార్క్ హీరోయిన్‌గా యాక్షన్ ప్రధాన పాత్రలో ఆమె కనిపించనున్నారని సమాచారం. ఈ భారీ మైథికల్ యాక్షన్ అడ్వెంచరస్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.