
ఇరాక్‌లో కిడ్నాప్ అయిన అమెరికా లేడీ జర్నలిస్టు షెల్లీ రెనీ కిటెల్సన్ గురించి ఇరాక్ అధికారి ఒకరు వివరాలు తెలిపారు. ఈ ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఇంతకు ముందు కూడా ఇరాక్‌లోకి అక్రమంగా రావడానికి యత్నించారు. అయితే అప్పుడు తిప్పి పంపించారు. తరువాత స్వల్ప కాలిక ప్రవేశ అనుమతి వీసాతో ఏదో విధంగా బాగ్దాద్ చేరుకుందని దేశ ప్రధాని మెహమ్మద్ షియా అల్ సూడానీ సలహాదారు అయిన అధికారి హుస్సేన్ అలావి తెలిపారు. బాగ్దాద్ వీధులలో ఈ జర్నలిస్టును ఎవరో అపహరించుకుని వెళ్లారు.బాగ్దాద్ వీధులలో రెండు కార్ల ద్వారా ఆమెను నాటకీయంగా కిడ్నాప్ చేసినట్లు సిసిటీవీ కెమెరాలతో వెల్లడైంది. ఆమె జాడ తెలియడం లేదు.
ప్రస్తుత యుద్ధం, ఇరాక్‌పై కూడా దాడుల క్రమంలో ఆమె ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఓ హోటల్‌లో ఉంటూ , బయటకు వెళ్లిన దశలో కిడ్నాప్ అయ్యారు. ఈ ఘటన సంబంధిత వివరాలు కొన్ని తెలిశాయని, ఆమె జాడ గురించి దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు. ఈ జర్నలిస్టును ఇరాన్ మద్దతు గల కతైబ్ హెజ్‌బోలా మిలిటెంట్ల ముఠాకు చెందిన వారు కిడ్నాప్ చేసి ఉంటారని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఎటువంటి నిర్థారణ జరుగలేదు.