
పద్మారావునగర్, వెలుగు: డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన గౌతమ్ గురుదత్త(40) ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
సోమవారం ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరలేదు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న గురుదత్త తన సమస్యల గురించి సహోద్యోగికి మెసేజ్ చేసినట్లు తెలిసింది. ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్ పంపిన అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసినట్లు సమాచారం. బోయిన్‌పల్లి పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.