Reading Time: 2 minutes

రాణి ఈజ్ బ్యాక్! పదేళ్ల తర్వాత ‘క్వీన్ 2’తో వస్తున్న కంగనా.. షూటింగ్ ఎప్పుడంటే?

Caption of Image.

వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. గత ఏడాది ‘ఎమర్జెన్సీ’ మూవీలో ఇందిరా గాంధీ పాత్రతో మెప్పించింది . ఇప్పుడు తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘క్వీన్’ చిత్రానికి సీక్వెల్‌తో రావడానికి సిద్ధమవుతున్నారు. పదేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి, కంగనాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు రెండో భాగానికి ముస్తాబవుతోంది.

‘క్వీన్ 2’ ముహూర్తం ఫిక్స్!

2014లో వికాస్ బాల్ దర్శకత్వంలో వచ్చిన ‘క్వీన్’, ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి తన పెళ్లి రద్దయ్యాక ఒంటరిగా విదేశాలకు హనీమూన్‌కు వెళ్లి, అక్కడ తనను తాను ఎలా కొత్తగా ఆవిష్కరించుకుంది అనే స్ఫూర్తిదాయక కథాంశంతో తెరకెక్కింది. ఇప్పుడు ‘క్వీన్ 2’ రాబోతోందన్న వార్త సినీ ప్రియుల్లో మరింత అసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. రాణి ఈజ్ బ్యాక్ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈసారి స్వదేశంలోనే సెల్ఫ్ డిస్కవరీ!

మొదటి భాగంలో ‘రాణి’ పాత్ర ప్యారిస్, ఆమ్‌స్టర్‌డ్యామ్ వంటి నగరాల్లో పర్యటించి ప్రపంచాన్ని చూసింది. కానీ, సీక్వెల్‌లో కథాంశం పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని సమాచారం. ఇందులో రాణి ఒక అమాయకపు చిన్న ఊరి అమ్మాయిలా కాకుండా, ఆత్మవిశ్వాసం కలిగిన ఒక మోడ్రన్ సిటీ గర్ల్‌గా కనిపించనుంది.  విదేశీ వీధుల్లో కాకుండా, ఈసారి రాణి ప్రయాణం మన దేశంలోని వివిధ మెట్రో నగరాల చుట్టూ సాగనుంది. మహిళా సాధికారత, వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మొదటి భాగాన్ని అద్భుతంగా మలిచిన వికాస్ బహ్ల్ ఈ సీక్వెల్‌ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు.

షూటింగ్ షెడ్యూల్ 

ప్రస్తుతం రాజకీయాల్లో ఎంపీగా బిజీగా ఉన్నప్పటికీ, కంగనా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు మూడు నెలల నిరంతర షెడ్యూల్‌తో సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈసారి పాత నటీనటుల కంటే కొత్త థియేటర్ ఆర్టిస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కంగనా ‘హ్యాట్రిక్’ ప్లాన్!

క్వీన్ 2 పూర్తయిన వెంటనే కంగనా మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘తను వెడ్స్ మను 3’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. వరుస సీక్వెల్స్‌తో తన పాత మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయాలని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నారు. రాణి పాత్ర నా హృదయానికి చాలా దగ్గరైనది. ఆ పాత్ర ద్వారా మహిళల్లో ధైర్యాన్ని నింపడం సంతోషంగా ఉంది అని కంగనా గతంలో పేర్కొన్నారు. మొత్తానికి, పదేళ్ల తర్వాత మళ్ళీ ‘రాణి’గా కంగనా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా కేవలం వినోదాన్నే కాకుండా, నేటి తరం మహిళలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేలా ఉండబోతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.