Reading Time: < 1 minute

నా బాడీ పార్ట్స్‌పై దారుణమైన కామెంట్స్.. మహేష్ బాబు హీరోయిన్ ఎమోషనల్!

Caption of Image.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘1 నేనొక్కడినే’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి సనన్, ఆ తర్వాత ‘దోచేయ్’, ‘ఆది పురుష్ ‘లో నటించింది. గతేడాది ‘అమరకావ్యం’తోనూ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీలతో అలరించే ఈ అందాల తార ప్రస్తుతం ‘కాక్ టైల్ 2’ సినిమాతో బిజీగా ఉంది.  భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీపై  అంచనాలు భారీగానే ఉన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ మొదట్లో సవాళ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది కృతి. ‘తొలి నాళ్లలో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ‘నువ్వు నవ్వినప్పుడు నీ చిగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి’.. ఇలా ఎన్నో మాటలు వింటూ ఉండేదాన్ని. ఇక్కడ మిమ్మల్ని మీరు నమ్మడమే మీ సూపర్ పవర్. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. విమర్శల్ని అధిగమించకపోతే.. మార్పు ఎలా తీసుకు రాగలం. అందుకే మనసు మాట వింటూ కష్టపడుతూ పనిచేసుకోవాలి అని చెప్పుకొచ్చింది. 

ఇక ‘కాక్ టైల్ 2’లో తన క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని తెలిపింది కృతి . నా పర్సనాలిటీలో నాకే తెలియని యాంగిల్ సు డైరెక్టర్ అదజానియా చూపించారు. బహుశా నా కెరీర్ లో హాటెస్ట్ క్యారెక్టర్ ఇదే. ‘కాక్ టైల్ 2’,  ‘కాక్ టైల్’ స్టోరీ లైన్ వేర్వేరు అని తెలిపింది. వైబ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయితో ‘కాక్ టైల్ 2’ స్టోరీ నడుస్తుంది. ఇక ఈ మూవీలో షాహిత్ కపూర్ సరసన రష్మిక మందన, కృతి సనన్ నటిస్తోంది.  డింపుల్ కపాడియా, అర్జున్ రాంపాల్, రోహిత్  సరాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రం  ఈ ఏడాది జూన్ 19న రిలీజ్ కానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.
 

©️ VIL Media Pvt Ltd.