
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూసుకుపోతున్న లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ VerSe Innovation మరో కీలక అడుగు వేసింది. దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్ అడ్వైజర్లలో ఒకరైన డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్ పిఆర్. రమేష్ ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించింది.
VerSe Innovationలో పీఆర్ రమేష్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. పిఆర్. రమేష్ వంటి ఎక్స్ పర్ట్ బోర్డులోకి రావడంతో ఇన్వెస్టర్లలో కూడా సంస్థపై నమ్మకం మరింత పెరగనుంది.
ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ.. రమేష్ అపారమైన అనుభవం, సంస్థలో ఆర్థిక క్రమశిక్షణను, పారదర్శకతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
40 ఏళ్లకు పైగా అనుభవం
చార్టర్డ్ అకౌంటెంట్‌గా 40 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న రమేష్ గతంలో డెలాయిట్ ఇండియా (Deloitte India) ఛైర్మన్‌గా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేశారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల బోర్డుల్లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు.సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఏ వంటి అత్యున్నత నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో ఉండి.. దేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుండి బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవార్డును అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.