
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఐపిఎల్ 2026లో భాగంగా తొలి మ్యాచ్ లో ఢిల్లీపై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న లక్నోకు శుభారంభం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. తర్వాత మార్‌క్రమ్ (11) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 7 ఓవర్లలో 50/3తో ఢిల్లీ ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో మిచెల్ మార్ష్ (21), పూరన్(1)లు ఉన్నారు.