Reading Time: < 1 minute

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల విడుదలు రెండో వారంలో విడుదల కానున్నాయి. ముందుగా ఏప్రిల్ 6వ తేదీనే ఫలితాలు విడుదల చేయాలని భావించినా, బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాల వల్ల రెండో వారానికి వాయిదా వేశారు. ఫలితాల ప్రకటనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి సమాధాన పత్రాల రీ వెరిఫికేషన్ చేయించనున్నారు. సింగిల్ సబ్జెక్టు ఫెయిలైన వారితోపాటు ఒక్కో సబ్జెక్టులో కొన్ని జవాబుపత్రాలను ర్యాండమ్‌గా వెరిఫికేషన్ చేయించనున్నారు. ఆ తర్వాత సిజిజిలో ట్రయల్స్ నిర్వహించి అంతా సవ్యంగా ఉంటేనే ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్ ఫలితాలు విడుదలైన వారం పది రోజుల తర్వాత డిగ్రీ ప్రవేశాల కోసం ఇచ్చే దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.