Reading Time: < 1 minute

ORRపై.. కారులోనే ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్య

Caption of Image.

మేడ్చల్ జిల్లాలో  విషాదం నెలకొంది. కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ డాక్టర్  ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎంతో మంది ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్   తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం అందరినీ కలిచివేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ జోసఫ్ అనే వ్యక్తి కీసర ORR సమీపంలో తన సొంత తార్ కారులో విగతజీవిగా పడి ఉన్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం  ఆయన ఇంజక్షన్ ద్వారా విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆత్మహత్య వెనుక కుటుంబ కలహాలే ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. తన కొడుకు మరణానికి భార్య వేధింపులే కారణమని డాక్టర్ జోసెఫ్ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. భార్య పెట్టే మానసిక వేధింపులు తాళలేకనే తన కుమారుడు  ఆత్మహత్య  చేసుకున్నాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి డాక్టర్ జోసఫ్ ఆత్మహత్యకు గల కారణాలపై  దర్యాప్తు చేస్తున్నారు. ఒక విద్యావంతుడైన వైద్యుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
 

©️ VIL Media Pvt Ltd.