Reading Time: < 1 minute

మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో రైతు సహకర సంఘం లిమిటెడ్ బ్యాంకులో ఉద్యోగులు తప్ప తాగి తందనాలు ఆడారు. అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్ లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో ఉద్యోగులు కలిసి మద్యం సేవించారు. బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి సమయంలో లోన్లు మంజూరు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ఆరోపణలు చేస్తున్నారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లంచం తీసుకొని లోన్లు మంజూరు చేస్తున్నారని మోత్కూరు వాసులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.