Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ బుధవారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొ న్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా ప్రాజెక్టు పురోగతి, ప్రజల భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. మూసీ ప్రాజెక్టు రూపకల్పన, అమల్లో ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈనెల 15వ తేదీ వరకు ప్రజలు తమ సలహాలను, సూచనలను ప్రభుత్వానికి పంపవచ్చని కమిటీ వెల్లడించింది.

ప్రాజెక్టుపై అభిప్రాయాలు ఉన్నవారు musrirdc@gmail.com అనే అధికారిక ఇమెయిల్ ఐడీకి తమ సూచనలను పంపాలని కేబినెట్ సబ్ కమిటీ కోరింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పునరావాస ప్యాకేజీలు, అభివృద్ధి పనుల విషయంలో పారదర్శకత పాటించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోం ది. ఈ క్రమంలో ప్రజలు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ప్రాజెక్టు విజయవంతానికి ఎంతో దోహదపడతాయని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మంత్రు లు అభిప్రాయపడ్డారు.