Reading Time: < 1 minute
Iran Ready To End War With Us And Israel President Pezeshkian Sets Conditions

హమ్మయ్య.. ఏప్రిల్ 1న తీపికబురు అందింది. యుద్ధంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే మళ్లీ దాడులు జరగవని విశ్వసనీయమైన హామీలు ఇస్తేనే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ పత్రికా ఏఎఫ్‌పీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Trump: రేపు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్.. సర్వత్రా ఉత్కంఠ

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ.. భవిష్యత్తు దాడుల నుంచి రక్షణ కల్పించే చర్యలు ఏ తీర్మానంలోనైనా తప్పనిసరిగా ఉండాలని పెజెష్కియన్ డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో దురాక్రమణ పునరావృతం కాకుండా హామీలు ఇస్తే సంఘర్షణను ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా పెజెష్కియన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏప్రిల్ 2న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇరాన్‌తో యుద్ధం ముగించబోతున్నట్లుగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కీలక సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగిబోతున్నట్లుగా వెల్లడించారు. రేపటి ట్రంప్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్