
పారుతున్న కాళేశ్వరం జలాలే ప్రాజెక్టు ఫలితాలకు సజీవ సాక్షంగా నిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫోటోతో కూడిన సందేశాన్ని ఆయన పోస్ట్ చేశారు. లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లు లేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజావ సాక్షమని హరీష్ రావు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు అని అన్నారు.