Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని శాస్త్రిపురం కాలనీలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్థుల భవనాన్ని హైడ్రా అధికారులు కూలగొట్టారు. శాస్త్రపురం కాలనీలో సర్వే నెంబర్ 134/20లో సుమారు 6500 గజాల విస్తీర్ణంలో ఉన్న పార్క్ స్థలాన్ని కబ్జా చేసి భారీ భవన నిర్మాణాలు చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణంపై హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.  పోలీసుల బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమంగా నిర్మించిన నాలుగు నుండి ఐదు అంతస్తుల భవనాలను జెసిబిల సహాయంతో కూల్చివేశారు. పూర్తిగా నేలమట్టం చేస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ చర్యలతో కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.