
లక్నో: లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా తమ తొలి ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్‌కు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని, ముందుగా లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇరుజట్లు విజయంతో ఘనంగా ఈ మెగా టోర్నీని ఆరంభించాలని పట్టుదలగా ఉన్నాయి.
ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్..
లక్నోలోని ఎకానా స్టేడియం పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. అయితే, ఈసారి పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. స్పిన్నర్లు కూడా అనుకూలంగా ఉండనుంది. మొదట బౌలింగ్ చేసి తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు సులభంగా ఉండే చాన్స్ ఉంది.
జట్ల వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నార్జే, ప్రిన్స్ యాదవ్.