Reading Time: < 1 minute
Iran Attack Amazon Data Center Bahrain Irgc Us Tech Firms Threat

Iran War: ఇరాన్ అన్నంత పని చేసింది. తమ గడ్డపై దాడులు చేస్తున్న అమెరికాకు, ధీటుగా బదులిస్తామని, ఏప్రిల్ 1 నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. నివేదికల ప్రకారం.. బహ్రైయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడికి పాల్పడింది. అయితే డేటా సెంటర్ ఇరాన్ మెయిన్ టార్గెట్ కానప్పటికీ, దాని సమీపంలో జరిగిన దాడి వల్ల డేటా సెంటర్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత భారీ స్థాయిలో సేవలు నిలిచివేతను నివారించేందుకు, తమ వర్క్‌లోడ్‌‌ను ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని అమెజాన్ తన క్లౌడ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.

Read Also: Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

దీనికి ఒక రోజు ముందు.. ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు చెందిన ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలపై అటాక్ చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్‌తో సహా 18 కంపెనీల పేర్లను పేర్కొంటూ వాటి ప్రాంతీయ కార్యకలాపాలపై దాడులు చేస్తామని ప్రకటించింది. అమెరికా దాని మిత్రదేశాల సైనిక చర్యలకు టెక్నాలజీ, ఏఐ, డేటా సపోర్టు అందిస్తున్నవి ఈ కంపెనీలే అని, అందుకే వీటిని లక్ష్యంగా చేసుకుంటామని చెప్పింది. ఈ సంస్థల్లో పనిచేస్తున్నవారు వెంటనే కార్యాలయాలు విడిచిపోవాలని, భద్రతా కారణాల వల్ల ఈ హెచ్చరిక ఇచ్చినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది.