Reading Time: 2 minutes
Ipl 2026 Arshdeep Singh Unwanted Record Longest Over Pbks Vs Gt

Arshdeep Singh Unwanted Record: టీమిండియా స్టార్ పేసర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ చరిత్రలో తాను ఎన్నడూ గుర్తుంచుకోవాలని అనుకోని ఒక అన్‌వాంటెడ్ రికార్డును మూటగట్టుకున్నాడు. మంగళవారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును అర్ష్‌దీప్ తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ చెత్త రికార్డ్ ఏంటి, దానిని ఎందుకని అర్ష్‌దీప్ గుర్తు ఉంచుకోవాలని అనుకోడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడు పార్లమెంట్‌ ముందుకు బిల్లు..

టీమిండియా స్టార్ పేసర్ ఒక్క ఓవర్.. 11 బంతులు వేయాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహిస్తాడా.. కానీ నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో పంజాబ్ తరఫున 20వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేశాడు. వైడ్లు, నో-బాల్స్‌తో ఓవర్ పూర్తి అయినా, అదనంగా మరొక ఐదు బాల్స్ వేసి స్టేడియంలోని ప్రేక్షకులను, జట్టు సభ్యులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ల రికార్డును అర్ష్‌దీప్ ఇప్పుడు సమం చేశాడు. ఒకవేళ ఈ ఓవర్‌లో మరో ఎక్స్‌ట్రా బంతి వేసి ఉంటే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డును సృష్టించిన వాడిగా నిలిచేవాడు.

ఐపీఎల్ చరిత్రలో సుదీర్ఘమైన ఓవర్లు (బంతులు) ఇవే..
11 – మహమ్మద్ సిరాజ్ vs MI, బెంగళూరు, 2023 (ఓవర్ #19)

11 – తుషార్ దేశ్‌పాండే vs LSG, చెన్నై, 2023 (ఓవర్ #4)

11 – శార్దూల్ ఠాకూర్ vs KKR, కోల్‌కతా, 2025 (ఓవర్ #13)

11 – సందీప్ శర్మ vs DC, ఢిల్లీ, 2025 (ఓవర్ #20)

11 – హార్దిక్ పాండ్యా vs GT, వాంఖేడే, 2025 (ఓవర్ #8)

11 – అర్ష్‌దీప్ సింగ్ vs GT, ముల్లన్‌పూర్, 2026 (ఓవర్ #20)*

ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ వేసింది చివరి ఓవర్ కావడంతో, ఈ ఓవర్‌పై మరింత ఉత్కంఠభరితంగా సాగింది. నో-బాల్స్, వైడ్‌ల కారణంగా ఓవర్ లెంత్ పెరిగి, బ్యాట్స్‌మెన్‌లకు అదనపు అవకాశాలు లభించి, మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. క్రికెట్‌లో ఒక ఓవర్‌లో సాధారణంగా ఆరు బాల్స్ ఉంటాయి, కానీ బౌలర్ లైన్, లెంగ్త్ కోల్పోయినప్పుడు, అదనపు బాల్స్ (నో-బాల్స్, వైడ్లు) ఓవర్‌ను పొడిగించగలవు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ పంజాబ్ కింగ్స్‌కు భారంగా మారింది. మనోడు తన కోటా 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 42 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఒక నో-బాల్, ఏకంగా 8 వైడ్లు ఉండటం గమనార్హం. ఇన్నింగ్స్ చివరలో ఒత్తిడికి లోనవ్వడం వల్ల లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయి ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. అర్ష్‌దీప్ వేసిన ఈ సుదీర్ఘ ఓవర్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపడమే కాకుండా, బౌలర్లు ఒత్తిడి సమయంలో ఎంత సంయమనంతో ఉండాలో మరోసారి గుర్తుచేసింది.

READ ALSO: Mohammed Shami : “ఆ రోజే క్రికెట్‌కు గుడ్ బై”.. రిటైర్మెంట్‌పై షమీ సంచలన వ్యాఖ్యలు!