Reading Time: < 1 minute

 ఐపిఎల్ సీజన్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కూపర్ కొనొలి అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కూపర్ 44 బంతుల్లోనే ఐదు ఫోర్లు,

5 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (37) తనవంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 ఫోర్లతో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ (38), గ్లెన్ ఫిలిప్స్ (25) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ మూడు, చాహల్ రెండు వికెట్లను పడగొట్టారు.