Reading Time: < 1 minute
Manchu Vishnu Rahul Ramakrishna Counter Anirudh Reddy Drug Test Comments

టాలీవుడ్ హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, అందులో నెగటివ్ వచ్చిన వాళ్ళ సినిమాలే రిలీజ్ చేసేలా చట్టం తీసుకురావాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్ కి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు స్పందిస్తున్నారు; అనిరుధ్ రెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ విషయం మీద మంచి సూచన చేశారు అంటూనే, తనదైన శైలిలో మంచు విష్ణు కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే ముందు రాజకీయ నేతలు సైతం పరీక్షలు చేయించుకోవాలని, ప్రజా ప్రతినిధులు కూడా పారదర్శకంగా ఉంటే ఓటర్లు కూడా సంతోషిస్తారని మంచు విష్ణు పోస్ట్ చేశారు.

Also Read:BandMelam: సినిమా బాలేకున్నా “బ్యాండ్ మేళం” వాయించాలా?

అదేవిధంగా, నటుడు రాహుల్ రామకృష్ణ కూడా లై డిటెక్టర్ టెస్టుల ప్రస్తావన తీసుకొచ్చి, రాజకీయ నేతలు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలని చెప్పుకొచ్చారు. తాను హీరో కాకపోయినా డ్రగ్ టెస్ట్ చేయించుకునేందుకు రెడీగా ఉన్నానంటూ ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ చెప్పుకొచ్చారు. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు డ్రగ్ టెస్టులు.. రాజకీయ నేతలు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుందాం అంటూ రాహుల్ రామకృష్ణ పేర్కొనడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజానికి, డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ డ్రగ్స్ కేసుల్లో ఎవరు ఉన్నా సరే, ఏ మాత్రం వెనకాడకుండా చర్యలు తీసుకుంటుంది.