Reading Time: < 1 minute

ఉద్యోగుల సమస్యలపై సీఎంను కలుస్తాం : టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

Caption of Image.
  • టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకుంటామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ అన్నారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్​రెడ్డిని కలుస్తామని తెలిపారు. వీరితోపాటు సహాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ట్రెజరర్ ఉమాదేవితో కలిపి మొత్తం 17 మందితో కూడిన కొత్త కార్యవర్గం మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో ఆఫీస్ లో ప్రమాణస్వీకారం చేసింది. 

అనంతరం సంఘం జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు వారిని సన్మానించారు. ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. పెండింగ్ డీఏలతోపాటు, పీఆర్సీ, ఉద్యోగులకు ఇన్సూరెన్స్, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు, ఈహెచ్ఎస్ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

©️ VIL Media Pvt Ltd.