Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ అంకిత్

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం/ జూలూరుపాడు, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోలు కోసం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 168 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్​ అంకిత్​ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో సంబంధిత శాఖల ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు. జిల్లాలో 1,87,309 మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పిస్తుందని తెలిపారు. ఏ గ్రేడ్​ ధాన్యానికి రూ.2,389, బీ గ్రేడ్​ రూ.2,389 మద్ధతు ధర ఉందన్నారు. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్​ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. 

ఎండలు ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మీటింగ్​లో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ణ, అడిషనల్​ కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీవో మధు తదితరులు పాల్గొన్నారు. జూలూరుపాడు కస్తూర్భా గాంధీ, పడమటి నర్సాపురం గిరిజన బాలికల పాఠశాలలను కలెక్టర్​ అంకిత్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యత, ఆహార నాణ్యత, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతులు పరిశీలించారు. బయోమెట్రిక్​ పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. 

©️ VIL Media Pvt Ltd.