Reading Time: < 1 minute
Mahesh Babu Rajamouli Varanasi Movie Di Colorist Update

మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్ లాంటి అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. అయితే వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్‌కు రెడీ చేస్తున్న నేపథ్యంలో, ఒకపక్క షూట్ చేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వచ్చిన ఈ సినిమా డీఐ (DI) కలరిస్ట్ ఆండ్రియాస్ బ్రుకల్‌తో ఎన్టీవీ (NTV) ప్రత్యేకంగా సంభాషించింది. ఈ సందర్భంగా ఆయన ఈ టీంతో పనిచేయడం ఈజీగా అనిపిస్తోందని చెబుతూనే, కంటెంట్ క్రియేట్ చేయడం మాత్రం చాలా కఠినంగా అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఒక టీజర్ కంటెంట్ ఇవ్వడానికి రాత్రి పగలు నిద్ర లేకుండా పని చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆయన అందించిన మరిన్ని విశేషాలు కింది వీడియోలో చూడొచ్చు.