Reading Time: < 1 minute

బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆత్మహత్య

Caption of Image.
  • ఉరివేసుకొని ఒకరు, బిల్డింగ్​ పైనుంచి దూకి మరొకరు సూసైడ్​
  • కొంతకాలంగా సహజీవనం చేస్తున్న జంట
  • మృతులు తెలంగాణ వాసులుగా గుర్తింపు

ములుగు, వెలుగు: తెలంగాణకు చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్​ ఇంజినీర్లు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఉరివేసుకొని ఒకరు, బిల్డింగ్​పై నుంచి దూకి మరొకరు సూసైడ్ ​చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నసాగర్ కు చెందిన భానుచందర్ రెడ్డి(32) బెంగళూరులో సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. 

మేడ్చల్‌‌ జిల్లాకు చెందిన షాజియా సిరాజ్‌‌(31) కూడా అక్కడే సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేస్తోంది. వీరిద్దరూ అక్కడే ఓ అపార్ట్​మెంట్​లో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల రంజాన్​ సందర్భంగా ఆమె మేడ్చల్ కు​వచ్చింది. ఆదివారం తిరిగి బెంగళూరులోని అపార్ట్​మెంట్​కు భానుచందర్ రెడ్డి​ ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే మృతుడి తమ్ముడు మణికాంత్​రెడ్డికి ఆమె ఫోన్​ చేసి విషయం చెప్పింది. అనంతరం అపార్ట్‌‌మెంట్‌‌ 17 అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.

©️ VIL Media Pvt Ltd.