Reading Time: < 1 minute
Rahul Sipligunj Love Marriage Harinya Bigg Boss Revelation

Rahul Sipligunj: ఆస్కార్ విజేత, టాలీవుడ్ పాపులర్ సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఒక ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ సింగర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో తన లవ్ గురించి పంచుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను అంత త్వరగా బయటపెట్టని రాహుల్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: US-Iran War: డీల్ చేసుకోండి, లేదంటే చస్తారు.. ఇరాన్‌కు యూఎస్ వార్నింగ్..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తాను బిగ్ బాస్ షో ఫైనలిస్ట్ అయిన తర్వాత స్టేజ్‌పై తీసుకెళ్లే ముందు.. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున గారు.. తన చేతిని ఒకరి చేతిలో పెట్టారు. అప్పుడు తన చేతిని పట్టుకున్న ఆమె.. ఇప్పటికీ తనను అంతే పదిలంగా పట్టుకుంది. నాకు బిగ్ బాస్ టైటిల్‌తో పాటు ‘నిజమైన ప్రేమ’ కూడా దొరికింది” అని అన్నారు. తను బిగ్ బాస్ షోకు కంటెంట్ రైటర్, బిగ్ బాస్ స్టేజ్ పైన మొదలైన తమ పరిచయం, తర్వాత కాలంలో బలమైన బంధంగా మారిందని చెప్పుకొచ్చారు. తన పార్ట్‌నర్ గురించి చెబుతూ.. “ఆమె నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ నన్ను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తుంది. కేవలం పొగడడమే కాదు, నా మంచికోసం నాతో గొడవ కూడా పడుతుంది. తను పడే ఆ గొడవలో కూడా నా మేలే ఉంటుంది” అని పేర్కొన్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్యను పెద్దల ఆశీర్వాదాలతో నవంబర్ 27న వివాహం చేసుకున్నారు.

READ ALSO: Summer Cooling Drinks: మండే ఎండల్లో అమృతం లాంటి డ్రింక్.. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోండి!