
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎర్రవెల్లి నివాసంలో గురువారం కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కెసిఆర్ కుమారుడు కెటిఆర్ తన కుటుంబంతో ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య కెసిఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎర్రవెల్లి నివాసంలో రంగు రంగుల ముగ్గుల ముందు కెసిఆర్‌తో కుటుంబ సభ్యులు కలిసి దిగిన ఫొటోను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.