Reading Time: < 1 minute

కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల బిల్లు (సిఎపిఎఫ్) 2026ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ప్రతిపక్షాల వాకౌట్ దశలో బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం పలికారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల నిర్వహణకు సంబంధించి చట్టపరమైన ఏకీకృత వ్యవస్థ కోసం ఈ బిల్లు తీసుకువచ్చారు. ఇప్పుడు సంబంధిత బలగాలకు సంబంధించి వేర్వేరు సర్వీసు నిబంధనల ఏర్పాటు ఉంది, దేశవ్యాప్తంగా ఐదు సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు దళాలు ఉన్నాయి. అంతకు ముందు బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. కేంద్రీయ పోలీసు బలగాలలలో సరైన సమర్థత, ఆత్మస్థయిర్యానికి ఈ ప్రతిపాదన

తీసకువచ్చినట్లు వివరించారు. దేశ సమాఖ్య విధాన బలోపేతానికి , రిక్రూట్మెంట్ కార్యకలాపాలు, క్రమబద్ధీకరణకు ఈ చర్య ఉపయోగపడుతుందని తెలిపారు. సమాఖ్య విధానానికి ఇది వ్యతిరేకంగా ఉందనే వాదనను తోసిపుచ్చారు. పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించాలని పట్టుపడుతూ ప్రతిపక్షాలు వాకౌట్‌కు దిగాయి. మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ప్రతిపక్షాలు సభాసాంప్రదాయాలను పట్టించుకోవడం లేదని సభా నాయకులు , కేంద్ర మంత్రి జెపి నడ్డా ఎదురుదాడికి దిగారు.