చర్మ సంరక్షణలో బియ్యం పిండి కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యం పిండి ఎండవల్ల దెబ్బతిన్న చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బియ్యం పిండి ఫేస్ ప్యాక్ అనేది చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో కాస్త పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ ముఖానికి రాసుకుని, 15 నుండి 20 నిమిషాల తర్వాత కడిగేయండి.
Skincare (4)
కొబ్బరి పాలు బియ్యం పిండి ఫేస్ ప్యాక్: దీని తయారీ కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో సరిపడా కొబ్బరి పాల వేసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకుని, 20 నిమిషాల తర్వాత కడిగేయండి. వారాని ఒక సారి ఇలా చేయడం ద్వారా మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
నిమ్మరసం బియ్యం పిండి ఫేస్ ప్యాక్: దీని తయారీ కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో కాస్త నిమ్మరసం వేసి దాన్ని బాగా కలపండి తర్వాత ఈ పేస్ట్‌ను మీ ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత కడిగి, పొడిగా తుడుచుకోండి. ఇదే కాదు కలబందతో కూడా మీరు ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో కలబంద గుజ్జు వేసి బాగా కలిపి ఈ పేస్ట్‌ను మీ ముఖానికి రాసుకుని, 20 నిమిషాల తర్వాత కడిగేయండి.
తేనే బియ్యం పిండి ఫేస్ ప్యాక్: ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని మీ ముఖానికి రాసుకుని, 20 నిమిషాల తర్వాత కడిగేయండి. Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైసా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రందించండి.




