Reading Time: 3 minutes
Pm Modi Joins Tea Garden Workers In Assam Photos Go Viral Amid Election Campaign

ప్రధాని మోడీ సామాన్యుడిలా మారిపోయారు. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి మరీ తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

M2

అస్సాంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల పోరు జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరుగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోడీ అస్సాం పర్యటనకు వచ్చారు. బుధవారం ఉదయం దిబ్రూగఢ్‌లోని తేయాకు తోటలకు వెళ్లారు. అక్కడ పని చేస్తున్న మహిళా కూలీలతో కలిసి తేయాకు ఆకులు కోశారు. వారితో ముచ్చటిస్తూ పని చేస్తూ కనిపించారు. అలాగే వారి సంస్కృతిని తెలుసుకుని సెల్ఫీ తీసుకున్నారు. అయితే దేశ ప్రధాని తమతో కలిసి పని చేయడంతో మహిళా కూలీలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

M3

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. తేయాకు అస్సాం ఆత్మ అని.. ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించుకుందని మోడీ రాసుకొచ్చారు. ‘‘ఈ ఉదయం దిబ్రుగఢ్‌లో నేను ఒక టీ తోటను సందర్శించి.. అక్కడ పనిచేస్తున్న మహిళలతో మాట్లాడాను. అది నాకు ఎంతో గుర్తుండిపోయే అనుభవం.’’ అని మోడీ పేర్కొన్నారు.

M4

‘‘తేయాకు కోసిన తర్వాత మహిళలు నాతో వారి సంస్కృతి గురించి మాట్లాడుతూ.. సెల్ఫీ కూడా తీసుకున్నారు. తేయాకు తోటల కుటుంబాలందరి కృషికి మేము చాలా గర్వపడుతున్నాం. వారి కఠోర శ్రమ, అంకితభావం అస్సాం కీర్తిని మరింత పెంచాయి.’’ అని మోడీ రాసుకొచ్చారు.

M5

ఏప్రిల్ 9వ తేదీన అస్సాంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది.

M6

M7

M8

M9

M10

M11

M12