Reading Time: < 1 minute

కోట్పల్లి బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తాం : స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్

Caption of Image.

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కోట్​పల్లి వాగుపై రూ.27.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వానాకాలంలో ప్రస్తుత లో లెవల్ బ్రిడ్జిపై నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయన్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.27.50 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. అంతకుముందు స్పీకర్​ వికారాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ బస్టాండ్‌‌‌‌లో మహిళా ప్రయాణికులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారీ, అడిషనల్​ కలెక్టర్ రాజేశ్వరి, ఆర్ అండ్ బీ సీఈ వసంత నాయక్, ఈఈ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.