Reading Time: < 1 minute

హైదరాబాద్‏లో దివాని స్టోర్ ప్రారంభించిన నటి నమ్రత శిరోద్కర్

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: సంప్రదాయ, ఆధునిక వస్త్రాలను అందించే దివాని స్టోర్​హైదరాబాద్‎లో నటి నమ్రత శిరోద్కర్ చేతుల మీదుగా ప్రారంభమయింది.  హైదరాబాద్ నిజాం రాజుల సంస్కృతిని ప్రతిబింబించే ఖడా దుపట్టా, ఫర్షీ ఘరారా వంటి వస్త్రాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. రాగి, వెండి, బంగారు జరీతో చేతితో రూపొందించిన ఈ వస్త్రాలు కళాకారుల నైపుణ్యాన్ని చాటుతున్నాయని నమ్రత చెప్పారు. జర్దోజీ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 500 మందికి పైగా కళాకారులకు ఉపాధి క ల్పిస్తున్నామని దివాని ఫౌండర్​ సాన్యా ధీర్ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.