
Mohammed Shami: టీమిండియా సీనియర్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మరోసారి వార్తల్లోకెక్కాడు. 2025–-26 దేశీవాళీ సీజన్లో పశ్చిమ బెంగాల్ తరఫున ఆడి మహమ్మద్ షమీ ఏకంగా 67 వికెట్లు తీసుకునప్పటికీ.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని భారత జట్టులోకి తీసుకోలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమీని సెలక్టర్లు పక్కన పెట్టడంపై విభిన్న కథనాలు ప్రచారం అవుతున్నాయ. ఈ క్రమంలో తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు షమీ తనదైన రితీలో ఆన్సర్ ఇచ్చాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి ఎదురైన ప్రశ్నకు మహమ్మద్ షమీ నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చాడు. నేను ఎప్పుడు అలసిపోతానో, ఆ రోజే ఆటకు వీడ్కోలు పలుకుతాను.. ప్రస్తుతానికి నాకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన లేదన్నారు. అలాంటి ఆలోచనలు మనల్ని మానసికంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి ఆలోచన మనసులోకి వచ్చిందంటే.. ఆటలో పెద్దగా రాణించలేమన్నారు. నేను ఎప్పుడు నిద్రలేచిన తర్వాత క్రికెట్ పట్ల బోర్‌గా ఫీలవుతానో ఆ రోజే స్వస్తి పలుకుతానని షమీ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఫిట్‌గా ఉన్నా, ఆటను ఎంజాయ్ చేస్తున్నానని.. ఫలితాలు కూడా సానుకూలంగానే ఉన్నాయని వెల్లడించారు.
2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌ను ఫైనల్ చేర్చడంలో షమీ కీ రోల్ పోషించాడు. కానీ గాయాలతో కొంతకాలం జట్టుకు దూరమైనా తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో చెలరేగుతున్నాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లకు, టీ20 వరల్డ్ కప్‌కు అతడిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ పట్టించుకోకపోవడం గమనార్హం. కేవలం వయసును బట్టి సెలెక్టర్లు యంగ్ ప్లేయర్స్ కి అవకాశం ఇస్తున్నట్లు కనిపస్తుంది. కాగా ఐపీఎల్ లోనూ మహమ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరపున ఆడనున్నారు. ఈ కొత్త టీమ్ తరపున రాణిచ్చేందుకు రెడీగా ఉన్నట్లు పేర్కొన్నారు.