
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయంలో మూడు శాఖలు దూసుకుపోతున్నాయి.2025-26 ఆర్థి క సంవత్సరానికి గానూ వాణిజ్య పన్నుల శాఖ, ఎ క్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు గతేడాది కన్నా ఈసారి ఆదాయంలో అధిక వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలో మొ దటిస్థానం కమర్షియల్ ట్యాక్స్‌ది కాగా, రెండోస్థా నం ఎక్సైజ్ శాఖ, మూడో స్థానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు ఉంటాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) గానూ కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం సుమారు రూ.78,655 కోట్ల పైచిలుకు రాగా, ఎక్సైజ్ శాఖకు రూ.39,494 కోట్లు, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.15,925కోట్ల ఆదా యం వచ్చినట్టు ఆ శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ గణాంకాలు 31వ తేదీ రాత్రి వ రకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఈ గణాంకాల్లో స్వల్పమార్పులు ఉంటాయని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు.
గత సంవత్సరం (2024-25)లో కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం రూ.75,149 కోట్లు కాగా, ఎక్సైజ్ శాఖకు రూ.34,603 కోట్లు, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.14,214 కోట్ల ఆదా యం వచ్చింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం గతేడాది కన్నా ఈసారి రూ.3,506 కోట్ల ఆదాయం అధికంగా వ చ్చింది. ఇక, ఎక్సైజ్ శాఖకు గతేడాది కన్నా ఈసారి రూ.4,891 కోట్ల అధిక ఆదాయం రాగా, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.1,711 కోట్ల అధిక ఆదాయం రావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) కమర్షియల్ ట్యాక్స్ ఆదాయంలో జిఎస్టీ వసూళ్ల ద్వారా రూ.43 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ఈ శాఖకు రాగా, పెట్రోల్ ఉత్పత్తుల ట్యాక్స్ ద్వారా సుమారుగా రూ.32 వేల కోట్ల పైచిలుకు ఆదాయం, ఇతర ట్యాక్స్‌ల ద్వారా మొత్తంగా ఆ శాఖకు రూ.78,655 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్టుగా ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఈసారి ఎక్సైజ్ శాఖ 14శాతం వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) గానూ ఎక్సైజ్ శాఖకు జనవరిలో రూ.3,325 కోట్లు, ఫిబ్రవరిలో రూ.3,208 కోట్లు, మార్చిలో రూ.3,425 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరిలో 34 లక్షల బీర్ల కేసులను, 32 లక్షల మద్యం పెట్టేలను, ఫిబ్రవరిలో 38 లక్షల బీర్ల కేసులను, 29 లక్షల మద్యం పెట్టేలను, మార్చిలో 25 లక్షల మద్యం కేసులను, 44 లక్షల బీ ర్ల కేసులను ఎక్సైజ్ శాఖ విక్రయించింది. దీంతోపా టు 2025 అక్టోబర్‌లో కొత్త మద్యంషాపుల కోసం వచ్చిన దరఖాస్తుల రూపంలో సుమారుగా రూ.2,868 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.39,494 కోట్లు ఆదాయం రాగా, గతేడాది
ఈసారి 14 శాతం వృద్ధిని ఆ శాఖ నమోదు చేసింది.
18.05లక్షల డాక్యుమెంట్‌లతో..
ఈ ఆర్థిక సంవత్సరం (2025,26) గాను (సుమారుగా 18.05లక్షల) డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌ల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.15,925 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి 31వ తేదీ, బుధవారం ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం రాత్రి వరకు రిజిస్ట్రేషన్‌లకు వెసులుబాటు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్‌లు చేసుకోవడానికి వినియోగదారులు భారీగా స్లాట్లు బుక్ చేశారు. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్‌లకు దరఖాస్తు చేయడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పనిగంటలు పెంచడంతో సబ్ రిజిస్ట్రార్‌లు డాక్యుమెంట్లను పూర్తి చేశారు. ఆర్థిక సంవత్సరం నేటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూడు రోజుల పాటు ఉదయం 9.30ల నుంచి రాత్రి 8.30ల వరకు పనిగంటలను పెంచింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ మూడు రోజుల పాటు రెగ్యులర్‌గా జరిగే రిజిస్ట్రేషన్ల కంటే 60 శాతం అదనంగా స్లాట్లను కేటాయించారు.