Reading Time: < 1 minute

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పలకరించిన హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతోంది. అనుష్క, జయసూర్య కలిసి నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’. మంగళవారం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, శాండీ మాస్టర్‌, వినీత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.