Reading Time: < 1 minute

దుబాయ్పై ఇరాన్ మిసైల్స్ దాడి.. ఇద్దరు ఇండియన్స్కు తీవ్ర గాయాలు

Caption of Image.

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం అని ప్రకటిస్తూనే దూకుడు పెంచింది అమెరికా. మరోవైపు అమెరికా తగ్గినా తాము తగ్గమని ఇజ్రాయెల్ ప్రకటించింది. దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తూనే డ్రోన్లు, మిసైళ్లతో సమాధానం చెబుతోంది ఇరాన్. 

2026 మార్చి 31న దుబాయి అల్ బదా ఏరియాలో.. నివాస సముదాయంపై డ్రోన్స్, మిసైల్స్ శకలాలు కూలడంతో పలువురు గాయపడినట్లు దుబాయి మీడియా ప్రకటించింది. ఈ ఘటనలో ఇద్దరు ఇండియన్స్ తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన ఒక్కొక్కరు గాయపడినట్లు వెల్లడించింది. శకలాలు పడి ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్ స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. 

పోర్టుపై డ్రోన్ తో దాడికి దిగింది ఇరాన్. ఈ దాడిలో పలువురు గాయపడగా.. అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. 

మరోవైపు దుబాయి ఓడరేవులోని కువైట్ ఆయిల్ ట్యాంకర్ టార్గెట్ గా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. తెల్లవారు జామున జరిగిన దాడిలో.. కువైట్ కు చెందిన భారీ చమురు ఓడ (VLCC)పై దాడి జరిగినట్లు కువైట్ పెట్రోల్ కార్పోరేషన్ (KPC) ప్రకటించింది. ట్యాంకర్ లో ఉన్న 24 మంది సిబ్బంది సేఫ్ గా ఉన్నారని తెలిపింది. ట్యాంకర్ ను అంటుకున్న మంటలను వెంటనే ఆర్పివేసినట్లు దుబాయి అధికారులు వెల్లడించారు. 

అంతకు ముందే సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రేవు దగ్గర గ్రీక్ షిప్ పై ప్రొజెక్టైల్స్ దాడి జరిగింది. అయితే ఈ రెండు దాడులు చేసింది ఎవరనేది ఇంకా ఎవరూ ప్రకటించుకోలేదని తెలుస్తోంది. ఇరాన్ పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.