Reading Time: 3 minutes
Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 2, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఒకటి రెండు అదృష్టాలు కలగబోతున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి చెందడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, శుక్ర, బుధుల వల్ల ఒకటి రెండు అదృష్టాలు కలగబోతున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి చెందడం జరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు సహాయ సహకారాలు అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

లాభ స్థానంలో రవి, కుజ, శనుల సంచారంతో పాటు ధన స్థానంలో గురువు ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు, శని, రవి, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుక్ర, రవి, కుజ గ్రహాల అనుకూలత ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అష్టమ శని కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. రాశ్యధిపతి రవి కూడా అష్టమంలోనే ఉన్నందువల్ల స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ప్రధాన కార్యకలాపాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెంచాలి. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ప్రస్తుతం ధన స్థానం బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో వేగం పుంజుకుంటాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

షష్ట స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా అధిక లాభాలను పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించి పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

పంచమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడు, రవి కారణంగా ఆర్థికంగా ఆశించిన మేరకు పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గురు, శుక్ర, రవుల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబపరంగా బాధ్యతలు వృద్ధి చెందుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

శుక్ర, బుధ, కుజ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ధన స్థానంలో రాశ్యధిపతి శనితో కుజ, రవులు కలవడం వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి సంబంధం కుదుతుంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగానే ఉంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశిలో ఉన్న రవి, కుజుల కారణంగా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు లేదు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి.