Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు రూ.195.50 పెంచాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,078.50 లకు చేరింది. మార్చి 1న కూడా 19 కిలోల సిలిండర్ రేటు 114.5 పెరిగింది. మార్చి 7న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.60 పెరగ్గా, ఇప్పుడు ఈ రేటు ఎలాంటి మార్పులేదు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు ఎటిఎఫ్, ఎల్‌పిజి ధరలను సవరిస్తాయి. వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలతో హోటళ్లలో టిఫిన్లు, భోజనం, టీ రేట్లు పెరిగే అవకాశం ఉంది.

రెట్టింపైన విమాన ఇంధన ధర

దేశీయ విమాన ఇంధన ధరలు రెట్టింపు అయ్యాయి. కిలో లీటరు ధర రూ.2.07 లక్షల కోట్లకు చేరింది. అంటే 114.5 శాతం లేదా రూ.1,10,703 పెరిగింది. మొదటిసారిగా వి మాన ఇంధనం ధర రూ.2 లక్షల కోట్ల మార్క్ ను దాటింది. 2022లో రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా ఇది కిలో లీటరు రూ.1.1 లక్షలకు పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వి మానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు పెరిగి, భవిష్యత్తులో ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.