
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బు ధవారం నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచే వ రకు నిర వధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతం లో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లు గా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మా ర్జిన్ రూ.16కు తగ్గించారని, దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు బుధవారం నుంచి నిరవ ధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ధరలు పడిపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు,
ఈ బంద్ పిలుపు పెద్దదెబ్బగా మారనుంది. బుధ వారం నుండి మాంసం లభ్యత ఉంటుందో లే దో అన్న సందేహంతో చాలామంది ఈరోజే మార్కెట్లకు క్యూ కడుతున్నారు. ఈ తరు ణం లో చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పౌ ల్ట్రీ కంపెనీలు రిటైల్ షాప్‌లకు ఇస్తున్న మార్జిన్‌లో ఇప్పుడు కోత విధించి చిన్న చిన్న దుకాణాలను లేకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇలాంటి ఆలోచనను పౌల్ట్రీ కంపెనీలు మానుకోవాలని సూచిం చారు. బుధవా రం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధ ర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు.