Reading Time: 2 minutes
Tvs Motor Secured Top Spot In Indian Market With 49453 Units

ఫ్యుయల్ సంక్షోభం వేళ అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. బడ్జెట్ ధరలో, అద్భుతమైన ఫీచర్లతో పలు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ మార్చి 2026లో కొత్త అమ్మకాల రికార్డును నెలకొల్పింది. నివేదికల ప్రకారం, ఈ నెలలో మొత్తం 1.91 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు అమ్ముడయ్యాయి. అంటే, భారతదేశంలో సగటున ప్రతిరోజూ సుమారు 6,159 ఎలక్ట్రిక్ వాహనాలు సేల్ అయ్యాయి. గత సంవత్సరంతో (మార్చి 2025) పోలిస్తే అమ్మకాలు 45% పెరిగాయి. టాప్ 5 వాహనాలను ఒకసారి చూద్దాం.

Also Read:AP Weather Alert: రేపు ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు.. అధికారుల హెచ్చరిక!

టీవీఎస్ మోటార్ కంపెనీ

మార్చి నెలలో, టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ మొత్తం 49,453 స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్ ఆర్బిటర్, ఐక్యూబ్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి ఆదరణ లభించడంతో పాటు, వాటికి అధిక డిమాండ్ కూడా నెలకొంది. 49,453 యూనిట్లతో టీవీఎస్ మోటార్ భారత మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది.

బజాజ్ ఆటో

బజాజ్ ఆటో మార్చి నెలలోని 31 రోజుల్లో తన చేతక్ స్కూటర్ల 46,246 యూనిట్లను విక్రయించింది, ఇది గత ఏడాదితో పోలిస్తే 31 శాతం అధికం. ఒకే నెలలో ఇంత పెద్ద సంఖ్యలో స్కూటర్లను విక్రయించడం బజాజ్ ఆటోకు ఒక రికార్డు.

ఏథర్ ఎనర్జీ

ఆటోకార్ ఇండియా ప్రకారం, మార్చి 2026లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ఏథర్ ఎనర్జీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ రిజ్టా, 450 సిరీస్‌లతో సహా మొత్తం 35,688 స్కూటర్లను విక్రయించింది. గత నెల ఏథర్ ఎనర్జీకి అత్యంత విజయవంతమైన నెలగా నిలిచింది.

హీరో విడా

హీరో మోటోకార్ప్ వారి విడా స్కూటర్లు గత మార్చిలో రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించాయి. గత నెలలోని 31 రోజుల్లో విడా వివిధ మోడళ్లకు చెందిన మొత్తం 21,434 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2025 మార్చితో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 8,039 యూనిట్లతో పోలిస్తే, ఈ సంవత్సరం అమ్మకాలు ఏకంగా 128 శాతం పెరిగాయి.

Also Read:Carmeni Selvam: అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే ‘కార్మేని సెల్వం’

ఓలా ఎలక్ట్రిక్

గత మార్చిలో, ఓలా ఎలక్ట్రిక్ 10,117 స్కూటర్లను విక్రయించింది. ఈ పెరుగుదలతో, ఓలా అగ్ర 5 కంపెనీల జాబితాలో తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. గతంలో, ఫిబ్రవరిలో, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఓలాను అధిగమించి, దానిని అగ్ర 5 జాబితా నుండి తొలగించింది.