Reading Time: 2 minutes
Actress Raasi: ‘పెళ్లై పెళ్లాలు ఉండి కూడా నాకు ప్రపోజ్ చేశారు’..  టాలీవుడ్ హీరోలపై రాశి కామెంట్స్ వైరల్

ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయిన వారిలో రాశి ఒకరు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ కథానాయికగా చేసిందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత, గిల్లి కజ్జాలు, ప్రేయసి రావే, పోస్ట్ మ్యాన్, అమ్మో ఒకటో తారీఖు, సందడే సందడి, శ్రీరామ చంద్రులు నటి రాశికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
కేవలం హీరోయిన్ గానే కాకుండా రవితేజ వెంకీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది రాశి. అలాగే మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో నెగెటివ్ రోల్ చేసి మెప్పించింది. డైరెక్టర్ నివాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాల నుంచి విరామం తీసుకుందీ అందాల తార. సెకెండ్ ఇన్నింగ్స్ లో సహాయక నటిగా చేస్తూనే సీరియల్స్ లోనూ నటిస్తోంది. గిరిజా కళ్యాణం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది రాశి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ అందాల తార తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే హీరోలతో తన అటాచ్ మెంట్ ఎలా ఉండేదో చెప్పుకొచ్చింది.

‘నేను హీరోయిన్‌గా సినిమాలు చేస్తోన్న కాలంలో లవ్వు గట్రాలేం లేవు. ఎందుకంటే నాకు బేసిక్ గా అబ్బాయిలంటే భయం. నన్ను ఇష్టపడ్డ వాళ్లు కొంత మంది ప్రపోజ్ చేశారు కానీ.. వాళ్లకి అప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్లకి పెళ్లై పెళ్లాలు ఉండి నాకు ప్రపోజ్ చేశారు. వాళ్లు అలా చేసినప్పుడు.. హో.. సారీ అని అనేసే దాన్ని. నేను చాలామంది హీరోలతో పనిచేశాను. నేను అమితాబ్ నుంచి కమల్ సార్ వరకూ పెద్ద పెద్ద హీరోలను చూశాను. కానీ ఎవరితోనూ పెద్దగా అటాచ్ మెంట్ లేదు. శ్రీకాంత్, జేడీ చక్రవర్తిలతో కలిసి ఎక్కువ సినిమాలు చేశాను. కాబట్టి వారితో కాస్త క్లోజ్ నెస్ ఉండేది. అదే క్లోజ్ నెస్ మిగిలిన హీరోలతో లేదు.

‘బాలకృష్ణతో చిన్నప్పుడు ‘బాల గోపాలుడు’ సినిమా చేశాను. ఆ తర్వాత పెద్దయ్యాక క్రిష్ణబాబులో హీరోయిన్‌గా చేశాను. అలాగే రాజశేఖర్ గారితో మమతల కోవెలలో కూతురుగా చేశాను. ఆ తర్వాత అదే రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘నేటి గాంధీ’ సినిమాలో హీరోయిన్ గ చేశాను. అప్పట్లో అంకుల్, డాడీ అని పిలిచి.. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్‌గా చేయాలంటే ఆ ఫీలింగ్ రాదు. కాబట్టి నాకు సినిమా అంటే సినిమా. యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే. నాకు ప్రపోజ్ చేసిన ఇద్దరు ముగ్గురు కూడా వాళ్లకి ఆల్రెడీ పెళ్లైన తరువాత చెప్పారే. కానీ అలాంటి వాళ్లని యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఆస్తి, అంతస్తు, అందం కంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ముఖ్యం. అందుకే వాటన్నింటినీ వద్దనుకుని డైరెక్టర్ నివాస్‌ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ మాకు పెళ్లై 21 ఏళ్లు అవుతుంది. మేం చాలా హ్యపీగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చింది రాశి. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.