Reading Time: < 1 minute
Pm Modi Chairs High Level Security Meeting On West Asia Crisis

ప్రధాని మోడీ ఈ సాయంత్రం కీలక భద్రతా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులంతా హాజరుకానున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో ఎదుర్కొన్నట్లుగానే.. తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, చమురు, గ్యాస్ గురించి పుకార్లు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సాయంత్రం జరిగే సమావేశంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గృహ వినియోగదారులకు ఎలాంటి గ్యాస్ కొరత రాకుండా చర్యలు చేపట్టే ఛాన్సుంది.

ఇది కూడా చదవండి: Midhun Reddy: అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు.. మిధున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో పరిస్థితులు ఘోరంగా మారాయి. తీవ్ర గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి కొరత లేకుండా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ఇది కూడా చదవండి: Iran War: యుద్ధాన్ని ముగించబోతున్నాం.. ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన!