Reading Time: < 1 minute

 సీఎం రేవంత్‌రెడ్డి తాను రాముడిని అని.. మాజీ సీఎం కేసీఆర్ రావణుడు అని అంటున్నారని.. అయితే శకుని ఎవరు అని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం అనం తరం ఆమె మీడియాతో చిట్‌చాట్ చేశారు. మావోయిస్టులు కూడా తమ పార్టీలోకి వస్తారని, వారిది తమది ఒకే ఎజెండా అని వెల్లడించారు. అసె ంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టుకున్నారని ఆరోపించారు.

అలా గే బీఅర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని చెప్పారుహిళలకు సబ్ కోటా ఇవ్వాలని పోరాటం చేస్తామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కుర్మిద్దలో పెద్ద భూస్వాముల భూములు వదిలి పేద గిరిజనుల భూములు టీజీఐఐసీ గుంజుకుంటున్నదని త్వరలో వారికోసం పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి ముందు ఉమా భారతి సహా ఇతర పెద్ద లను కలిసి ఆశీర్వాదం తీసుకుంటామన్నారు.