
ఎండాకాలంలో చిర్రుబుర్రు లాడుతుంటా. ఇక మహిళలైతే చెప్పనక్కరలేదు.. కిచెన్ హీట్తట్టుకోలేక.. ఉక్కపోతలో కిచెన్ ఎక్కువ సమయం ఉండలేక చాలా చిరాకు పడుతుంటారు. కాని తప్పదు కదా.. పిల్లలకు.. భర్తకు బాక్స్ సిద్దం చేయాలి. పిల్లలను బడికి పంపించాలి.. ఇక భార్య కూడా జాబ్ చేప్తుంటే అన్ని ఇన్నీ తిప్పలు కావు.. అందుకే టేస్టీగా ఉండి జస్ట్ 20 నిమిషాల్లో తయారయ్యే వంటకాల గురించి తెలుసుకుందాం. . .
ఉప్పిడి పిండి తయారీకి కావలసినవి
- బియ్యం రవ్వ: ఒక కప్పు
- నీళ్లు: మూడు కప్పులు
- జీలకర్ర: రెండు టీ స్పూన్లు
- ఆవాలు: ఒక టీ స్పూన్
- కరివేపాకు: రెండు రెమ్మలు
- పచ్చిమిర్చి: నాలుగు (సన్నగా తరిగినవి)
- పచ్చి శనగ పప్పు : ఒక టేబుల్ స్పూన్
- ఉల్లిగడ్డ తరుగు: అర కప్పు (సన్నగా, పొడవుగా)
- ఉప్పు, నూనె: తగినంత
ఉప్పిడి పిండి తయారీ విధానం
స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చెయ్యాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిశెనగ పప్పు, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అవి వేగాక నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగాక బియ్యం రవ్వ వేసి ఐదు నిమిషాలు ఉడికిస్తే ఉప్పిడిపిండి రెడీ. బడికి వెళ్లే పిల్లలకు అప్పటికప్పుడు చేసి వేడి వేడిగా పెట్టొచ్చు
సజ్జ రొట్టెలు తయారీకి కావాల్సినవి
- సజ్జ పిండి: ఒక కప్పు
- నీళ్లు: మూడు కప్పులు
- ఉప్పు: తగినంత
సజ్జ రొట్టెలు తయారీ విధానం
స్టవ్ మీద బాండీ పెట్టి ఒక గిన్నెలో పిండికి మూడొంతులు నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సజ్జపిండి పోసి తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. పిండి ముద్దగా అయ్యాక స్టవ్ ఆపేయాలి.. వేడి చల్లారాక ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చెయ్యాలి.
►ALSO READ | Vastu tips: ఇంట్లో బాత్రూం ఏ దిక్కుల్లో ఉండాలి.. గోడలు.. పిట్ట గోడల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
తర్వాత ఒక పీటపై కొద్దిగా పొడి పిండి చేసి చేతితో అద్దుతూ రొట్టెలా చెయ్యాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. రొట్టెపై కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ మాడకుండా కాల్చాలి. ఒక కప్పు పిండితో మూడు రొట్టెలు చేయవచ్చు.