Reading Time: < 1 minute

ఐపిఎల్ 2026లో భాగంగా పంజాప్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్(11) విఫలం కాగా.. శుభ్ మన్ గిల్(39), జోస్ బట్లర్(38), గ్లెన్ ఫిలిప్స్(25)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీంతో గుజరాత్, పంజాబ్ జట్టుకు కేవలం 163 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ మూడు వికెట్లతో రాణించగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు, జాన్సెన్ ఒక వికెట్ తీశారు.